1) Copy this list of Opposition MPs from Andhra Pradesh and Telengana. You can simply pick your state, or email MPs of both states.
Andhra Pradesh
butta.renuka@sansad.nic.in,
jayadev.galla@sansad.nic.in,
kesineni.srinivas@sansad.nic.in,
kothapalligeetha@gmail.com,
muralimohan.maganti@sansad.nic.in,
maganttibabu@gmail.com,
malaydri@gmail.com,
pandularavi@gmail.com,
nimmalakristappa@gmail.com,
agajapathiraju.p@sansad.nic.in,
rammnk9@gmail.com,
knro12699@gmail.com,
rsrdelhi11@gmail.com,
ms.rao19@sansad.nic.in,
jcdr.tdp@gmail.com,
spyreddymp@hotmail.com,
narasimham@sansad.nic.in,
thotanarasimhammp@gmail.com
Telengana
vkumar.boianapalli@sansad.nic.in,
nageshgodam@gmail.com,
drbnarsaiah@yahoo.com,
gutha.loksabha@gmail.com,
asrnaik9@gmail.com,
asad.owaisi@sansad.nic.in,
pasunooridayakar@gmail.com,
bbpatil7777@gmail.com,
chmallareddy999@gmail.com,
kvishweshwar.reddy@sansad.nic.in,
psrysrcp@gmail.com,
nandiyellaiah@yahoo.co.in
2) Paste in the “to” field of your email client.
3) In the “subject” field, copy/paste: “REQUEST TO OPPOSE HECI DRAFT BILL 2018”
4) In the body of the text, copy/paste the following:
ప్రియమైన శాసనసభ సభ్యులకు,
మీకు సవినయముగా విన్నవించునది ఏమనగా HECI Billను శాసనసభ వర్షాకాల సమావేశంలో ప్రవేశపెట్టకుండా తిరస్కరించి విశ్వవిద్యాలయాలను మరియు విద్యావ్యవస్థను రక్షించ వలసిందిగా మనవి. సదరు బిల్లులో ఏకకాలంలో UGC Act 1956 యొక్క ఉపసంహరణ కూడా ప్రతిపాదించ బడుతుంది. ఈ ప్రక్రియ ఏ కారణంచేత ఇంత త్వరగా అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయో తెలియలేదు. UGC 1956 నుండి ఉనికిలో ఉన్న వ్యవస్థ. అటువంటి గొప్ప సంస్థను 3 నెలల్లోనే ఉపసంహరించడం అనేది అభిలషణీయం కాదు.
ఇంతే కాకుండా విద్యార్థులతో కానీ ఉపాధ్యాయులతో కానీ విద్యాసంస్థలతో కానీ ఎటువంటి సంప్రదింపులు జరపకుండానే ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. విద్యా వ్యవస్థలో ప్రధాన భాగస్వామ్యులైన వీరితో చర్చించకుండా అటువంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం . అంతేకాకుండా ఈ విషయమై దీని ద్వారా కలిగే పరిణామాల గురించి పూర్తిగా చర్చలు జరిపే అవకాశం ఇవ్వకపోవడం విచారించదగ్గ విషయం.
ఈ బిల్లులోని అనేక లోపాలు మన దేశంలోని ఉన్నత విద్యా వ్యవస్థలపై విపరీతమైన ప్రభావాలకు దారి తీస్తుంది . ఈ బిల్లుకు సంబంధించిన డ్రాఫ్ట్ 27 జూన్ 2018న ప్రజా నిర్ణయం కొరకు విడుదల చేయబడింది . మూడు వారాలు కూడా గడవకముందే సాధారణ ప్రజానీకం మరియు సంబంధిత పౌరుల నుండి ఆ బిల్లులోని వివాదాస్పద అంశాలను గురించి అత్యధికంగా ౭౫౨౯ సంఖ్యలో స్పందనను చవిచూసింది. సమాజంలోని భిన్న వర్గాల నుండి వచ్చిన ఇటువంటి ప్రతిస్పందనే శాసనసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి ముందు ఈ అంశంపై సరియైన సంప్రదింపులు, తగిన చర్చల అవసరం ఎంతగా ఉందో చెప్పడానికి నిదర్శనం. ఇన్ని స్పందనలు వచ్చినప్పటికి, ప్రజాభిప్రాయానికి ప్రజాస్వామ్య పద్ధతులకి వ్యతిరేకంగా ఈ బిల్లును ప్రవేశపెట్టడానికే నిర్ణయించడం జరిగింది. ఈ డ్రాఫ్ట్ లో కొన్ని సవరణలను ప్రవేశపెట్టారు. ఇందులోని విషయాలను కానీ మార్పుల విస్తృతిని గాని ఖచ్చితంగా తెలియ చేయకుండానే బిల్లును వర్షాకాల సమావేశంలో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అంత పెద్ద సంఖ్యలో తమ వ్యతిరేకతను తెలిపినవారికి మార్పుల గురించి కనీస సమాచారం కూడా తెలియజేయలేదు. అంతేకాకుండా, దేశ వ్యాప్తంగా ఉపాధ్యాయ మరియు విద్యార్థి సంఘాలు ఈ బిల్లు యొక్క రద్దు మరియు UGCని కొనసాగించాలని కోరాయి. కానీ ఇందుకు విరుద్ధంగా ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నడుస్తున్నట్లు అనిపిస్తుంది.
జాతీయస్థాయి ఉపాధ్యాయ మరియు విద్యా సంఘాల నుండి ఈ బిల్లు అందుకున్న విమర్శలకు weblinks చూడండి:
https://betteruniversities.in/2018/07/23/heci-draft-bill-2018-media-coverage/
https://betteruniversities.in/2018/07/23/heci-draft-bill-2018-responses/
1. ఈ బిల్లు వల్ల వల్ల UGC నిధులు విడుదల చేసే అవకాశం కోల్పోతుంది. అంతేకాక MHRD లేదా మరేదైనా సంస్థకు ఈ అధికారం వెళ్తుంది. ఈ విధంగా పని కష్టతరమవుతుంది. దీనిద్వారా ప్రణాళికా తయారీ ఒకరి చేతిలో, నిధుల మంజూరు మరో చేతిలో ఉంచబడుతుంది. దీని ద్వారావివిధ సంస్థల మధ్య సమన్వయ కొరవడి, వ్యత్యాసం పెరుగుతుంది.
2. HECI ద్వారా ఉన్నత విద్యా వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడం జరుగుతుంది. కమిషన్ లోని 12 మందిలో పది మంది కేంద్ర ప్రభుత్వ అధికారులు లేదా కేంద్ర ప్రభుత్వంచే నియమించబడిన వారే. మనదేశంలోని విద్యా వ్యవస్థని శాసించే ఇటువంటి బిల్లులో కేవలం ఇద్దరు వ్యక్తులకు ఉపాధ్యాయుల స్థానం పరిమితమవ్వడం భావ్యం కాదు. ఇంతేకాకుండా ఈ కమిషన్లో స్త్రీలు గానీ దివ్యాంగులు గాని ట్రాన్స్ జెండర్ వ్యక్తులుగాని, SC ST OBC వంటి దిగువ జాతి వర్గాలకు చెందిన వారికి ఈ కమిషన్లో స్థానం కల్పించలేదు.
3. విద్యాసంస్థల గుర్తింపులో అటానమీ వివిధ స్థాయిలో ఉంటుంది. ఇంతేకాకుండా విద్యాసంస్థలను పూర్తిగా మూసి వేసే అధికారం కూడా ఉండడం మూలాన నియంతృత్వం వస్తుంది. దీనివలన వ్యవస్థలో గందరగోళం ఏర్పడటమే కాకుండా వనరులు మరియు విలువైన సమయం వృధా చేయబడుతుంది. ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత ఉండదు. ఫీజుల పెంపు మరియు ప్రైవేటీకరణకు అవకాశం ఉంది. విద్యార్థులు మరియు వారి కుటుంబాలలో అశాంతి నెలకొంటుంది. దీనివల్ల ఇంతకు మునుపు చేసినటువంటి చట్టాలు అన్ని వ్యర్థం అవుతాయి.
4. HECI నాణ్యతా ప్రమాణాల పేరుతో అందరికీ ఒకే లాంటి విద్య తగదు. One size fits all రూపము ఇక్కడ వర్తించదు. విజయం సాధించలేదు. దేశంలోని వైవిద్యం, భిన్న వర్గాల కు విద్యావ్యవస్థ విస్తరణ, కొన్ని వర్గాలకు ఇప్పుడిప్పుడే ఉన్నత విద్య అందుబాటులోకి రావడం వల్ల న్యాయం మరియు సామాజిక స్పృహ ఉన్న కమిటీ అవసరం ఎంతో ఉంది. HECI బిల్లు మూలాన వెనుకబడిన వర్గాలకు ఉన్నతవిద్య విస్తరణ జరగదు.
5. HECI బిల్లు మూలానా ఉన్నత విద్యా సంస్థలకు autonomy ఉండదు. మరియు కేంద్ర ప్రభుత్వం నియంతృత్వంలోకి వెళ్లి పోతుంది. ఉన్నత విద్యకు సంబంధించిన నాణ్యతా ప్రమాణాలలో చేసే మార్పులను కమిషన్ కంటే ముందే ప్రభుత్వం యొక్క ఆమోదాన్ని పొందాలి. దీనివలన ఉన్నత విద్యా సంస్థల యొక్క వాక్ స్వేచ్ఛ, ఆలోచనా స్వేచ్ఛ, భావ స్వేచ్ఛలకి ఆటంకం కలుగుతుంది. బలవంతపు విధేయత వాతావరణం నెలకొంటుంది. ఇది సమాజంలోని ఎటువంటి అర్థవంతమైన మెరుగుదలకు సహకరించదు.మా అభిప్రాయాన్ని గౌరవించి మీరు శాసనసభలో ఈ బిల్లును వ్యతిరేకిస్తూ వాదించగలరని మనవి. అంతేకాకుండా కమిటీ ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యావేత్తలకు వారి అభిప్రాయాన్ని వ్యక్త పరిచే అవకాశం కల్పించగలరు.
5) Press SEND
1 thought on “HECI Draft Bill 2018 Letter to MPs – Telugu”